Tuesday, February 25, 2025
HomeTrending NewsMaleria: 20 ఏళ్ళ తర్వాత అమెరికాలో మలేరియా

Maleria: 20 ఏళ్ళ తర్వాత అమెరికాలో మలేరియా

లాటిన్ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో అడవుల నరికివేత, కాలుష్య కారక పరిశ్రమలతో పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. ఆయా దేశాల్లో చికెన్‌గున్యా, డెంగ్యూలతో పాటు వివిధ రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాను కొత్త సమస్య కలవరపెడుతోంది.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల ప్రజల్ని చిన్న దోమ భయపెడుతున్నది. 20 ఏండ్ల తర్వాత మళ్లీ ఆయా రాష్ట్రాల్లో  మలేరియా వ్యాప్తి చెందుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫ్లోరిడా, టెక్సాస్‌ రాష్ట్రాల్లో మలేరియా వ్యాప్తి పెద్ద ఎత్తున ఉండటంతో ప్రభుత్వ అధికారులు ఆరోగ్య హెచ్చరికలు జారీచేశారు.

వాతావరణ మార్పులు, భూతాపం నేపథ్యంలో 2070నాటికి ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల మంది మలేరియా బారిన పడే ప్రమాదముందని ఒక అధ్యయనం అంచనావేసింది. పర్యావరణ మార్పులు, భూతాపం వల్ల యూరప్‌, అమెరికాలో మలేరియా, చికెన్‌గున్యా, డెంగ్యూ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందే అవకాశముందని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్