Friday, April 19, 2024
Homeసినిమా‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్

‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్న ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించగా.. సంచలన సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించారు. ఈ పాటను దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఇటీవల భీమ్లా నాయక్ టీజర్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పాటతో ఆకట్టుకున్నాడు.

‘భీం భీం భీం భీం భీమ్లానాయక్..’ అంటూ సాగే ఈ పాట అభిమానులకు మరింత ఆనందాన్ని అందిస్తుంది. ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ పాట అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ట్విట్టర్ లో స్పందిస్తూ… ‘శాస్త్రి గారు.. (రామ జోగయ్య శాస్త్రి) ఈ పాట రాసిన పెన్ను నాకు గిఫ్ట్ గా ఇవ్వండి. మారణహోమం సృష్టించారు’ అని కామెంట్ చేయడం విశేషం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్