Thursday, April 25, 2024
Homeసినిమాలైగ‌ర్ ఇవ్వబోయే స‌ర్ ఫ్రైజ్ ఏమిటో?

లైగ‌ర్ ఇవ్వబోయే స‌ర్ ఫ్రైజ్ ఏమిటో?

Surprise: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ స్పోర్ట్స్ యాక్ష‌న్ మూవీ ‘లైగ‌ర్‘. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. అతి త్వరలో ఓ సర్ప్రైజ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండట్విటర్ ద్వారా తెలియ‌చేశాడు. ‘నేను ఆకలితో ఉన్నా.. ఇండియా ఆకలితో ఉంది. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు.  మే 9న సాయంత్రం 4 గంటలకు ఈ సర్ ప్రైజ్ చూపిస్తామని పేర్కొన్నాడు.

ఇక ఈ పోస్టర్లో హెచ్చరిక.. అతడు వేట మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు అని ఉండటంతో టీజర్ అనౌన్స్మెంట్ లేదా స్పెషల్ థీమ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. విజ‌య్ పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరి నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. లైగ‌ర్ తో విజ‌య్, పూరి ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : లైగ‌ర్ కాంబినేష‌న్ రిపీట్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్