Sunday, January 19, 2025
Homeసినిమాఆడ‌వాళ్లు మీకు జోహార్లు ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న‌.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న‌.

AMJ Trailer: శ‌ర్వానంద్‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్  సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 4న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ‘ఏ అమ్మాయినైనా ఫ‌స్ట్ మీరొచ్చి చూస్తే సెంటిమెంట్‌గా మంచి సంబంధం కుదురుతుంద‌ట క‌దా… ఎప్పుడొచ్చి చూస్తారు’ అని ఒక‌మ్మాయి చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది.

‘నిజంగానే వీడి గురించి బ‌య‌టి టాక్ అలాగే ఉంద‌క్కా’ అంటూ శ‌ర్వా ఫ్యామిలీ మెంబ‌ర్ డైలాగ్ ఉంటుంది. ఇంటి నిండా ఆడ‌వాళ్లు క‌లిసి చూసిన ప్ర‌తి సంబంధంలోనూ లోపాలు వెతుకుతార‌నే విష‌యం ట్రైల‌ర్‌లో ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ల చేష్ట‌ల‌కు విసిగిపోయిన హీరో చాలు… నాకు ఆస్కార్ వ‌ద్దు. సినిమా ఆడితే చాలు అని అన‌డం ఫ‌న్నీగా ఉంటుంది. అలాంటి అబ్బాయికి ర‌ష్మిక తార‌స‌ప‌డుతుంది. ఆమె ‘మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?` అని అడిగితే `వీకెండ్ ప్లాన్స్ అంటే ఏముంటాయండీ.. తాగ‌డం, తిన‌డం, తొంగోవ‌డం… అలా అంద‌రిలా కాకుండా, అంత‌ర్వేదో, అన్న‌వ‌ర‌మో వెళ్లొద్దామ‌ని అనుకుంటున్నానండీ’ అంటాడు హీరో. ‘ఎక్క‌డ దొరికావురా స్వామీ నువ్వు నాకు’ అని హీరోయిన్ అంటుంది.

‘నువ్వేం వ‌ర్రీ అవ‌కు ఆద్యా… నేను చూసుకుంటా` అంటాడు హీరో. `నీకంటే పెద్ద వ‌ర్రీ ఇంకేం లేదు నాకు` అని అంటుంది హీరోయిన్‌. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తే హీరోయిన్ త‌ల్లి ఖుష్బూకి త‌న కూతురికి పెళ్లి చేసే ఆలోచ‌న ఉండ‌దు. ఒక‌వేళ పెళ్ల‌యినా పిల్ల‌లు పుట్టాక అల్లుడు ఇంట్లో ప‌నులు చేస్తే, కూతురు ఉద్యోగానికి వెళ్లాల‌నుకునే బాప‌త‌న్న‌మాట‌. త‌మ ఇంటి కుర్రాడు అలాంటి ప‌నులు చేయ‌డానికి స‌సేమిరా ఒప్పుకోరు హీరో ఇంట్లో లేడీస్. క‌థ ఇలా జ‌రుగుతుండ‌గా… కొన్నాళ్ల‌కు ఇంకో ఇష్యూలో… మా బాధ‌లు మేం ప‌డ‌తాం కానీ, నువ్వెళ్లు` అంటుంది హీరోయిన్‌.

నీకూ మీ ఆడాళ్ల‌కి వ‌స్తే బాధా.. నాకూ మా మ‌గాళ్ల‌కు వ‌స్తే కాదా.. అని హీరోయిన్‌ని నిల‌దీస్తాడు హీరో. అక్క‌డి నుంచి ఇంటికి వ‌చ్చి త‌మ వాళ్ల‌తో.. `మీరేమో లాక్‌డౌన్ టైమ్‌లో పెళ్ల‌నే ప‌రీక్ష రాయ‌కుండానే పాస్ అయిపోయి… నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా?` అని బాధ‌ప‌డ‌తాడు. ఈ ట్రైల‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఆద్యంతం ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. మార్చి 4న విడుద‌ల కానుంది ఆడ‌వాళ్లు మీకు జోహార్లు. మ‌రి.. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్