Sunday, January 19, 2025
Homeసినిమారామ్ తో ఫైట్ చేసేది ఆర్యా? ఆది పినిశెట్టా?

రామ్ తో ఫైట్ చేసేది ఆర్యా? ఆది పినిశెట్టా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, తమిళ దర్శకుడు లింగుసామి కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి రామ్ సరసన నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్, కృతిశెట్టి, సినీయర్ నటి నదియా తదితరుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో రామ్ కి విలన్‌గా ముందు సీనియర్ యాక్టర్ మాధవన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ.. అవన్నీ కేవలం పుకార్లేనని స్వయంగా దర్శకుడు లింగుసామి తెలియచేశారు. ఆ తర్వాత తమిళ హీరో ఆర్య విలన్ రోల్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆది పినిశెట్టిని కాంటాక్ట్ చేశారని.. అది విలన్ పాత్రకే అని టాక్ వినిపిస్తోంది. దీంతో రామ్ మూవీలో విలన్ ఆర్యా..? ఆది పినిశెట్టా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై చిత్రయూనిట్ త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్