9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending Newsఈటెల సంచలన వ్యాఖ్యలు

ఈటెల సంచలన వ్యాఖ్యలు

నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చిందని బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు మీ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తామని పది రోజుల క్రితమే ప్రకటించామని బిజెపి నేత ఈటల రాజేందర్ తెలిపారు. మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే అన్నారు. తెరాస నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల రాజేందర్ వరంగల్ లో ఆరోపించారు. నిన్న ఓ రైస్ మిల్లును కార్యకర్తలకు భోజనాల కోసం మాట్లాడుకుంటే.. ఆయనను బెదిరించారని, ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చిల్లర పనులు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదన్న ఈటల రాజేందర్ తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని  ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని ఈటల రాజేందర్ హెచ్చరించారు. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు మీకు దమ్ముంటే ముందు మీ దగ్గర పథకాలు అమలు చేయాలి.

యావత్ తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారని, హుజురాబాద్లో అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్ అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని చేయడం సరికాదని, చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టమన్నారు. పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారని తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో సాగే పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుందని, ప్రజలందరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్