అచ్చెన్నాయుడు హాజరుకావాలి

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉపనేత కె. అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కాకాణి అధ్యక్ష్యతన కమిటీ హాల్ లో జరిగింది.  స్పీకర్ పై అనుచిత వ్యాఖలు చేసినందున అచ్చెన్నాయుడు పై చర్యలు తీసుకోవాలని తమకు ఒక ఫిర్యాదు అందిందని, దానిపై అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని కాకాణి  చెప్పారు. అందుకే ఆయన్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని శాసనసభ కార్యదర్శి ద్వారా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్పీకర్ పై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇచ్చిన నోటీసు విషయంలో తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈరోజు సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించామన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పైనే ప్రధానంగా చర్చించామని , ప్రోటోకాల్ ఉల్లంఘనల కేసులు ఎక్కువగా వచ్చాయని, తదుపరి సమావేశం ఆగస్ట్ 10న నిర్వహిస్తామని కాకాణి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *