Saturday, January 18, 2025
Homeసినిమా'క్రేజీ ఫెలో' గా ఆది సాయికుమార్

‘క్రేజీ ఫెలో’ గా ఆది సాయికుమార్

Crazy:  యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధమోహన్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫణికృష్ణ సిరికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ఖారారు చేశారు. ఈ చిత్రంలో ఆది పోషిస్తున్న పాత్రకు తగ్గట్టు ఈ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఆది విభన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.

టైటిల్ పోస్టర్ కూల్ అండ్ క్లాస్ గా ఆకట్టుకుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, ‌సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఈ క్రేజీ ఫెలో రిలీజ్ ఎప్పుడు అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

Also Read : ఆది సాయికుమార్‌ చిత్రంతో మిర్నా మీనన్ ఎంట్రీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్