Sunday, September 8, 2024
Homeసినిమాఆది 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' ప్రారంభం

ఆది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ ప్రారంభం

‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’. ఈ మూవీని ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్.

రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1’ సినిమా. రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది.

సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్