Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్ఐసిసి టి-20 : ఒకే గ్రూప్ లో దాయాదులు

ఐసిసి టి-20 : ఒకే గ్రూప్ లో దాయాదులు

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగే టి-20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి గ్రూపులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది. తొలుత గ్రూప్ ఏ, బి మ్యాచ్ లు జరుగుతాయి. ఇండియా, పాకిస్తాన్ లు ఒకే గూప్ లో ఉన్నాయి, దీనితో మరోసారి దాయాదుల సమరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే…..

  • గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
    గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పి.ఎన్.బి., ఒమన్

ఒక్కో గ్రూప్ లో రెండేసి జట్లు సూపర్ 12 లో చోటు సంపాదిస్తాయి

ప్రధాన జట్ల విషయానికి వస్తే….

  • గ్రూప్ 1లో…. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు గ్రూప్ ‘ఏ’ విన్నర్, గ్రూప్ ‘బి’ రన్నర్
    గ్రూప్2 లో…. ఇండియా, పకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ ‘బి’ విన్నర్, గ్రూప్ ‘ఏ’ రన్నర్

తేదీలవారీగా పూర్తి షెడ్యూల్ ను అతి త్వరలో ప్రకటిస్తామని ఐసిసి వర్గాలు వెల్లడించాయి.

షెడ్యూల్ విడుదల చేయడం సంతోషంగా ఉందని, కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఆలస్యమైనా రాబోయే రెండు మూడు నెలల్లో క్రికెట్ అభిమానులు గొప్ప ఆటను తిలకించబోతున్నారని ఐసిసి యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అల్లార్దీస్ ధీమా వ్యక్తం చేశారు.

గ్రూపుల విభజనతో టి-20 వరల్డ్ కప్ సమరానికి కౌంట్ డౌన్ మొదలైందని బిసిసిఐ కార్యదర్శి జై షా అన్నారు. ఈ సంగ్రామంలో ఉత్కంత కలిగించే ఎన్నో మ్యాచ్ లు ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్న ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు. ఒమన్ లో ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు రావడం సంతోషంగా ఉందని, వారితో కలిసి ఈ టోర్నీకి కో-హోస్ట్ గా వ్యవహరించడం ఆనందంగా ఉందని షా వెల్లడించారు. ఒమన్ కూడా ఈ టోర్నీలో ఆడుతుండడం, అక్కడే ఈ మ్యాచ్ లు జరగడం ఆ దేశ యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు.

ఒమన్ క్రికెట్ చరిత్రలో ఇదో గొప్ప రోజుగా మిగిలిపోతుందని, ఐసిసి, బిసిసిఐ దిగ్గజాలు తమ వేదిక నుంచి ఈ షెడ్యూల్ విడుదల చేయడం తమకు గర్వకారణమని ఒమన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ పంకజ్ ఖిమ్జీ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్