Saturday, November 23, 2024
HomeTrending NewsAAP : ఇండియా కూటమిలో లుకలుకలు

AAP : ఇండియా కూటమిలో లుకలుకలు

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’లో లుకలుకలు బయటపడుతున్నాయి. బిహార్ శాసనసభ ఎన్నికలు 2025 చివరలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూటమికి షాక్‌ ఇచ్చింది. బీహర్‌లో తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ ఆధ్వర్యలో ఢిల్లీలో ఆ పార్టీ బీహార్‌ యూనిట్‌ సమావేశం జరిగింది. బీహార్‌కు చెందిన ఆప్‌ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.

బీహార్‌లో ఆప్‌ను బలోపేతం చేస్తామని సందీప్ పాఠక్ ఈ సందర్భంగా అన్నారు. అక్కడ డర్టీ రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. అందుకే బీహార్‌ అభివృద్ధి చెందడంలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2025లో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. దీని కోసం ఆ రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి పార్టీని విస్తరించాలని బీహార్‌ నాయకులకు సూచించారు.

మరోవైపు, బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూ, ఆర్జేడీ దీనిపై స్పందించాయి. ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామన్న ఆప్‌ ప్రకటనను తప్పుపట్టాయి. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు సందర్భంగా కొన్ని విధానాలను రూపొందించుకున్నట్లు ఆయా పార్టీల నేతలు తెలిపారు. ఈ విధానాలకు ఆప్‌ కట్టుబడి ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్