అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ రోజు పంపినట్లు అధికారులు తెలిపారు. మానీలాండింగ్ కేసులో సత్యేందర్ జైన్, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విషయంలో మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య సదుపాయాలు, పాలనా ఎజెండా అమలులో ఇద్దరు మంత్రులు కీలకంగా వ్యవహరించారు. ఇద్దరూ కేజ్రీవాల్‌కు విశ్వసనీయ నేతలు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు నేతలు కేజ్రీవాల్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరి 28న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యందర్ జైన్‌ల రాజీనామాలను ఆమోదించాలని ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థన మేరకు ఎల్‌జీ రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫారసు చేశారని రాజ్ నివాస్ అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు మంత్రుల రాజీనామాల నేపథ్యం ఇద్దరు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది.
Also Read : Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్