AB Retired:
సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. నేడు తన నిర్ణయాన్ని ఏబీ ప్రకటించాడు. తన దేశం తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ 2018లో స్వదేశంలో జోహెన్స్ బర్గ్ లో ఆస్ట్రేలియాతో ఆడాడు.
తోటి సహచరులతో కలిసి జాతీయ క్రికెట్ జట్టుకు ఆడడం మొదలు పెట్టిన నాటి నుంచి నేటి వరకూ తన క్రికెట్ జర్నీ అద్భుతంగా సాగిందని, ప్రస్తుతం 37 ఏళ్ళ వయసులో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించాడు. ఇన్నేళ్ళ తన కెరీర్ లో క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ, అంకిత భావంతో ఆడానని, ఈ వయసులో ఒకప్పటి ఫామ్ ప్రదర్శించడం కచ్చితంగా సాద్యం కాదని అందుకే వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు.
డివిలియర్స్ సౌతాఫ్రికా తరఫున తన చివరి వన్డేను 2018 ఫిబ్రవరి 16న ఇండియాతో, టెస్ట్ మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అదే ఏడాది మార్చి 30న ఆడాడు. చివరి టి20 మ్యాచ్ ను మాత్రం బంగ్లాదేశ్ తో 2017లో ఆడాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ఆడుతున్న ఏబీ చక్కని ఆటతీరు ప్రదర్శించాడు. మొత్తం 184 మ్యాచ్ లు ఆడి 5,162 పరుగులు చేశాడు.
అయితే, ఏబీ 2018 మే నెలలోనే అన్ని ఫార్మాట్ల నుంచీ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే కొన్నాళ్ళకే తన ప్రకటను సవరించి టి-20లకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అయినా జాతీయ జట్టులో అతనికి స్థానం లభించలేదు. నేటి ప్రకటనతో అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు కూడా ఏబీ గుడ్ బై చెప్పినట్లయ్యింది.
Also Read : రోహిత్ శర్మకే సారధ్యం