శ్రీలంకతో ఆ దేశంలో జరుగుతోన్న రెండో టెస్టులో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. నిన్న వర్షం కారణంగా కేవలం పది ఓవర్ల ఆట మాత్రమే సాగింది. 2 వికెట్లకు 178 పరుగులతో నేటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన పాకిస్తాన్ లో బాబర్ ఆజామ్ 39 పరుగులు చేసి ఔట్ కాగా, షాద్ షకీల్ అర్ధ సెంచరీ (57) చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ అహ్మద్ 14 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
నిన్న 87 పరుగులతో క్రీజులో ఉన్న అబ్దుల్ షఫీక్- ఆఘా సల్మాన్ ఐదో వికెట్ కు 135 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. షఫీక్ డబుల్ సెంచరీ (201) సాధించి ప్రభాత్ జయసూర్య బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆఘా సల్మాన్ కూడా సెంచరీ పూర్తి చేసి 132; రిజ్వాన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 5 వికెట్లకు 563 పరుగులు చేసింది.
మొత్తంగా 397 పరుగుల ఆధిక్యంలో పాకిస్తాన్ ఉంది.
లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3; ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు పడగొట్టారు.