Thursday, March 28, 2024
Homeసినిమా ఆచార్య మ‌ళ్లీ వాయిదా?

 ఆచార్య మ‌ళ్లీ వాయిదా?

Acharya – postponed?: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ ఆచార్య‌. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీ ఆచార్య ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇప్పుడు  ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌మోష‌న్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ‘సానా క‌ష్టం’ అనే పాట రిలీజ్ చేశారు. ఇక సంక్రాంతికి ఆచార్య ట్రైల‌ర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఆచార్య మ‌రోసారి వాయిదా ప‌డ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… ఈ సినిమా రీషూట్లు నిన్న మొన్నటి వరకు జ‌రుగుతూనే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ కంప్లీట్ చేయ‌డానికి గట్టిగా నెల కూడా లేదు. దీనికి తోడు ప్ర‌స్తుతం కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ ఫుల్ స్పీడ్ లో జ‌రగడం అంటే అంత ఈజీ కాదు.

ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి నాటికి కోవిడ్ కేసులు భయంకరంగా పెరుగుతాయి అంటున్నారు. అదే కనుక జ‌రిగితే.. ఖ‌చ్చితంగా ఆచార్య మ‌రోసారి వాయిదా ప‌డ‌డం ఖాయమ‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్