Saturday, January 18, 2025
Homeసినిమాఆచార్య ప్రీ రిలీజ్ వేదిక మారిందా..?

ఆచార్య ప్రీ రిలీజ్ వేదిక మారిందా..?

Event venue: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ ఆచార్య‌. ఇందులో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషించారు. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించింది. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది.

అయితే… ప్రీ రిలీజ్ ఈ వేడుక‌ను ఈ నెల 23న గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 23న విజ‌య‌వాడ‌లో ఫంక్ష‌న్ జ‌ర‌గ‌నుంద‌ని.. దీనికి ఏపీ సిఏం వై,ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రు కానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆత‌ర్వాత అది వాస్త‌వం కాద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ వేడుక ఇప్పుడు విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కి మారింద‌ని స‌మాచారం. అయితే.. ఈ వేడుక‌కు వ‌చ్చే ముఖ్య అతిథి ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్