Friday, April 19, 2024
Homeసినిమామ‌హేష్ తో బోయ‌పాటి మూవీ ఎప్పుడు?

మ‌హేష్ తో బోయ‌పాటి మూవీ ఎప్పుడు?

Mahesh- Boyapati: ఊర మాస్ డైరెక్ట‌ర్ అంటే.. ఠ‌క్కున గుర్తుకువ‌చ్చేది బోయ‌పాటి శ్రీను. ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ సాధించారు బోయ‌పాటి శ్రీను. ఆత‌ర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. పుష్ప 2 వ‌ల‌న ఆల‌స్యం అవుతుంద‌ని భావించి ఈ గ్యాప్ లో రామ్ తో బోయ‌పాటి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాని అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

అయితే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో సినిమా చేయాల‌నేది బోయ‌పాటి క‌ల‌. సింహా త‌ర్వాత బోయ‌పాటి.. మ‌హేష్ బాబును క‌లిసి క‌థ చెప్ప‌డం జ‌రిగింది కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌కుండా ఆగిపోయింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో బోయ‌పాటి మాట్లాడుతూ.. మ‌హేష్ బాబు అవకాశమిస్తే.. భవిష్యత్తులో ఆయనతో ఒక బ్రహ్మాండమైన మాస్ యాక్షన్ థ్రిల్లర్ తీయాలనుకుంటున్నట్టు చెప్పారు.

మ‌హేష్ స‌ర్కారు వారి పాట త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయ‌నున్నారు. ఆత‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నారు. ఆత‌ర్వాత బోయ‌పాటికి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్