Thursday, March 19, 2026
HomeTrending Newsదుమ్ములేపుతోన్న‌ ‘ఆచార్య’ ట్రైల‌ర్

దుమ్ములేపుతోన్న‌ ‘ఆచార్య’ ట్రైల‌ర్

Megacharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆచార్య‌’. ఈ చిత్రానికి బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తండ్రీకొడుకులు చిరు, చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ఆచార్య ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని మెగా అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆచార్య ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. రామ్ చరణ్ వాయిస్ లో ట్రైలర్ మొదలైంది. ‘దివ్య వనమొకవైపు… తీర్థ జలం ఒక వైపు… నడుమ ఆదఘట్టం..’ అంటూ టెంపుల్ సిటీ ధర్మ స్థలిలో సీన్ ఓపెన్ చేశారు. ‘ఇక్కడ అందరూ సౌమ్యులు పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలొచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని వుంటామేమో నని పొరబడి వుండొచ్చు…ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది. ధర్మ స్థలి.. అధర్మస్థలి ఎలా అవుతది?’ అంటూ చరణ్ చెబుతున్న డైలాగ్ లు.. ఆకట్టుకుంటున్నాయి.

కామ్రేడ్ డ్రెస్సుల్లో వున్న చిరు చరణ్ ఓ కొంత మంది వ్యక్తులని అడవిలో వేటాడే తీరు… చరణ్ పరుగెత్తుకుంటూ వస్తే చిరు చేయి చాపడం.. ఆ చేయి పై చరణ్ కాలు మోపి గాల్లోకి ఎగిరి ప్రత్యర్థుల గుండెల్ని చిలుస్తున్న తీరు చూస్తుంటే.. ఇది క‌దా మాకు కావాల్సింది అనిపిస్తోంది అభిమానుల‌కు. ఈ ట్రైల‌ర్ 4 మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ట్రైల‌రే ఇలా ఉంటే.. ఇక థియేట‌ర్లో సినిమా చూస్తే.. పూన‌కాలే. మ‌రి.. ఆచార్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular