Thursday, June 18, 2026
Homeసినిమాగౌతమ్ రాజు తనయుడు హీరోగా రెండో సినిమా  

గౌతమ్ రాజు తనయుడు హీరోగా రెండో సినిమా  

‘కృష్ణ రావు సూపర్ మార్కెట్’ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 2+4=24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. అరుళ్ మోసెస్ కూర్పు, మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత నంబిరాజ్ మాట్లాడుతూ “2+4=24 సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడి మీద పూర్తి నమ్మకంతోనే ఈ సినిమా చేస్తున్నాం. కథకు తగ్గ హీరో మాకు కృష్ణ గారి రూపంలో దొరికారు. అయన ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఎంతగానో అలరించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

దర్శకుడు ఆర్.పి రామ్ మాట్లాడుతూ “సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాత గారికి, సినిమా చేస్తున్న హీరో గారికి ధన్యవాదాలు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. త్వరలోనే మిగితా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. కృష్ణ నటన ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఆయనకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాను” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular