Saturday, January 18, 2025
Homeసినిమాకరోనాతో కవిత భర్త మృతి

కరోనాతో కవిత భర్త మృతి

కరోనా వైరస్ సీనియర్ నటి కవితకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆమె భర్త దశరథ రాజ్ కోవిడ్ బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కూడా జూన్ రెండోవారంలో కరోనాతోనే మృత్యువాత పడ్డారు. ఒకే నెలల్లో కవిత కొడుకును, భర్తను కోల్పోయారు. భర్త దశరథ ఆస్పత్రిలో చాలా రోజులు కరోనాతో పోరాడి చనిపోయారు.

సినీ, రాజకీయ ప్రముఖులు కవితకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 11 ఏళ్ల వయసులోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆమె నటించారు. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు. రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఆమెకు సరైన గుర్తింపు లేదని ఆమధ్య భారతీయ జనతా పార్టీలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్