Wednesday, April 17, 2024
HomeTrending Newsల్యాప్‌టాప్‌ల పంపిణి: క్యాబినెట్

ల్యాప్‌టాప్‌ల పంపిణి: క్యాబినెట్

రాష్ట్రవ్యాప్తంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ కొనుగోలు,. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్సిటీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జేఎన్‌టీయూ చట్టం 2008 సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం తెలిపింది. 2021-24 ఐటీ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

  • నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.
  • కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.
  • మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
  • రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
  • శాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం. 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .
  • పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా. తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.
  • రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
  • విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.
RELATED ARTICLES

Most Popular

న్యూస్