Thursday, March 12, 2026
Homeసినిమాకట్ట‌ప్ప‌కు క‌రోనా

కట్ట‌ప్ప‌కు క‌రోనా

Carona to Kattappa: క‌రోనా ఫ‌స్ట్ వేవ్, సెకండ్ వేవ్ వ‌చ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది అనుకుంటుంటే… క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చి అంద‌ర్నీ టెన్ష‌న్ పెడుతుంది. పాన్ ఇండియా మూవీస్ వాయిదా ప‌డ్డాయి. షూటింగ్ లు కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని చేయాల్సిన ప‌రిస్థితి. టాలీవుడ్లో మహేష్ బాబు, మంచు మనోజ్‌, మంచు లక్ష్మీ, మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌, హీరో విశ్వక్ సేన్‌కు కరోనా నిర్థారణ అయింది. వీళ్ళు మాత్రమే కాకుండా.. టాలీవుడ్లో చాలా మంది కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది.

ఇక కోలీవుడ్ లో కమల్, విక్రమ్, వడివేలు సహా చాలా మందికి కరోనా వచ్చింది. స్టార్‌ హీరోయిన్‌ త్రిషకు కూడా కరోనా వచ్చింది. ఇప్పుడు త‌మిళ సీనియ‌ర్ న‌టుడు, బాహుబ‌లి సినిమాలో న‌టించి క‌ట్ట‌ప్ప‌గా బాగా పాపుల‌ర్ అయిన‌ సత్యరాజ్‌ కూడా కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కరోనా ల‌క్ష‌ణాలు బాగా క‌నిపించ‌డంతో టెస్ట్ చేయించుకుంటే.. పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంట‌నే కుటుంబ సభ్యులు ఆయనను జనవరి 7 సాయంత్రం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించినట్లు తమిళ మీడియాలో వార్త‌లు వస్తున్నాయి. కాస్త సీరియ‌స్ గానే ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయ‌నున్నారని స‌మాచారం.

Also Read : మ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular