Thursday, March 19, 2026
Homeసినిమాటాలీవుడ్ పై ఆశలు వదులుకోని అనన్య పాండే!

టాలీవుడ్ పై ఆశలు వదులుకోని అనన్య పాండే!

మొదటి నుంచి కూడా తెలుగు తెరకి వచ్చే బాలీవుడ్ బ్యూటీల సంఖ్య ఎక్కువే. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ చాలామంది తెలుగు సినిమా చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ఒక్కటి హిట్ అయితే, చాలా ఇండస్ట్రీల నుంచి భారీ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన టాలీవుడ్ నుంచి ఛాన్స్ వెళితే, దాదాపుగా ఖాయం చేసుకోవడానికే ఈ భామలంతా ఆసక్తిని చూపిస్తున్నారు.

అలా తెలుగులోకి అడుగుపెట్టిన బాలీవుడ్ సుందరిగా అనన్య పాండే కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ సినిమా ద్వారా ఆమె ఇక్కడ అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తన టాలీవుడ్ ఎంట్రీ ఉండాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆమె మరింత బిజీ అయ్యేది. కానీ కంటెంట్ పరంగా ఈ సినిమా తేడా కొట్టేసింది. దాంతో పాన్ ఇండియా స్థాయిలోనే అనన్య డీలాపడిపోయింది.

హిందీలో ఆమె చేతిలో నాలుగు ప్రాజెకుల వరకూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా ఆమె మాత్రం టాలీవుడ్ పై ఆశలు వదులుకోలేదని అంటున్నారు. తెలుగులో మరో ప్రాజెక్టు ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకుంటున్నారు. త్వరలో ఆమె రామ్ .. నితిన్ .. అఖిల్ .. నాగశౌర్య వంటి హీరోల జట్టుకట్టే అవకాశాలు ఉన్నాయనే ఒక టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular