Monday, May 20, 2024
HomeTrending NewsWagner group: ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు

Wagner group: ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు

రష్యాకు చెందిన వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే దేశాధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ప్రిగోజిన్‌ ఈ తర్వాత రాజీకి వచ్చాడు. అయితే రాజకీయ చదరంగంలో ఒకసారి అనుమానం వస్తే ఇక ఉపెక్షించటం ఉండదు. అంతర్జాతీయ రాజకీయాల్లో శత్రువును అంతమొందించటం ఎక్కువగా విమాన ప్రయాణాల్లోనే జరుగుతుంది. రష్యాలో కూడా అదే జరిగిందని విశ్లేషకులు అంటున్నారు.

రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్‌ న్యూస్‌ ఏజన్సీ పేర్కొన్నది. అయితే ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. మాస్కో నుంచి సెయింట్‌ పీట్స్‌బర్గ్‌ వెళుతున్న ఒక ప్రైవేట్‌ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో 10 మంది మరణించారు.

వీరిలో ప్రిగోజిన్‌ పేరు కూడా ఉందని రష్యా వైమానిక సంస్థ రోసావియాట్సియా నిర్ధారించినట్టు టాస్‌ వెల్లడించింది. అందులో మరణించిన ప్రయాణికుడి పేరు ప్రిగోజిన్‌ ఇంటిపేరుతో సహా సరిపోయిందని రోసావియాట్సియా తెలిపింది. ప్రిగోజిన్‌ మరణమే కనుక నిజమైతే అది ప్రమాదం కాకపోవచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్