ఆకట్టుకోలేకపోయిన అవంతిక!

అందమైన భామలకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్ కమ్ చెబుతూనే ఉంటుంది. అలా ఈ ఏడాదిలో ఇంతవరకూ చాలామంది బ్యూటీలు ఇక్కడి తెరపై మెరిశారు. అలాంటివారి జాబితాలో తాజాగా అవంతిక దాసాని కూడా ఒకరుగా చేరిపోయింది. తెలుగు తెరపైకి చాలామంది అందగత్తెలు వస్తుంటారు .. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అలాంటివారిలో ఒకరుగా అవంతికను చూడలేము. ఎందుకంటే ఒకప్పుడు ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో దేశంలోని కుర్రాళ్లందరినీ ఒక ఊపు ఊపేసిన భాగ్యశ్రీకి గారాల కూతురే అవంతిక.

ఈ సుందరి హీరోయిన్ గా వచ్చిన సినిమానే ‘నేను స్టూడెంట్ సర్’. బెల్లంకొండ గణేశ్ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించింది. అక్కడక్కడా భాగ్యశ్రీ పోలికలు ఉన్నాయి. తెలుగులో భాగ్యశ్రీ చేసిన సినిమాలను వ్రేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.  అయినా ఆమెను ప్రేక్షకులు ఇప్పటివరకూ గుర్తుపెట్టుకోవడానికి కారణం ‘మైనే ప్యార్ కియా’ సినిమానే. ఆమె అందం .. ఆకర్షించే నవ్వుకు అప్పట్లో అభిమానులు కానివారంటూ లేరు. అలాంటి భాగ్యశ్రీ కూతురే అవంతిక అనగానే సహజంగానే కొంతమందిలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

తెరపై అవంతిక ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో థియేటర్స్ కి వెళ్లిన కుర్రాళ్లు ఉన్నారు.అయితే అవంతికకి ఈ సినిమాలో లభించిన పాత్ర అంతగా కట్టిపడేసేదేమీ కాదు. పొట్టి నిక్కర్లు వేసుకుని కాస్త గ్లామరస్ గా అయితే కనిపించింది. చక్కదనంలో తల్లితో పోల్చలేం గానీ, ఉన్న కాస్త గ్లామర్ ను  పాటల పరంగా .. రొమాన్స్  పరంగా చూపించలేకపోయారు. అందువలన అవంతిక పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆమె కోసమే థియేటర్స్ కి వెళ్లినవారికి నిరాశనే ఎదురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *