Saturday, January 18, 2025
Homeసినిమారంభ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

రంభ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం

సినీ నటి,  నాటి హీరోయిన్ రంభ త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కెనడాలో రంభ ప్రయాణిస్తున్న కారును మరో కారు ధీ కొట్టింది. ఈ ప్రమాదంలో రంభ చిన్న గాయాలతో బైట పడ్డారు, ఆమె కుమార్తె, చిన్నారి సాషా  చిన్నపాటి గాయాలతో  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని రంభ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పిల్లలను స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రంభ పేర్కొన్నారు.

‘చిన్నపాటి గాయాలైనా మేమంతా క్షేమంగా ఉన్నాం… చిన్నారి శశా ఇంకా ఆస్పత్రి లోనే చికిత్స పొందుతోంది. బ్యాడ్ డేస్, బ్యాడ్ టైమ్…  దేవుడు ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు వుండాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్