Thursday, March 28, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో రాహుల్ గాంధి యాత్ర

హైదరాబాద్ లో రాహుల్ గాంధి యాత్ర

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర 55 వ రోజు… తెలంగాణలో  ఏడవ రోజు శంషాబాద్ నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో శంషాబాద్ ప్రాంతం సందడిగా మారింది. రాహుల్ వెంట యాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మధు యాష్కి, మల్లు భట్టివిక్రమార్క, వంశీ చాంద్ రెడ్డి  తదితర అగ్రనేతలు ఉన్నారు. శంషాబాద్ నుంచి కాలేజి విద్యార్థులతో కలిసి నడుస్తున్న రాహుల్ గాంధీ. వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థినితో మాట్లాడి ఆమెకు  భరత నాట్యం వస్తుందని తెలుసుకొని అక్కడే కొద్దిసేపు నాట్యం చేయించి తిలకించిన రాహుల్ గాంధి విద్యార్థినిని అభినందించారు.

శంషాబాద్ – ఆరంగర్ – బహుదూర్ పురా – పురానా పూల్ – అఫ్జల్ గంజ్ – చార్మినార్ – మొజంజాహి మార్కెట్ – గాంధీ భవన్ – నాంపల్లి – పబ్లిక్ గార్డెన్ – అసెంబ్లీ – రవీంద్ర భారతి – సెక్రటేరియట్ – హుస్సేన్ సాగర్ – నెక్లేస్ రోడ్ మీదుగా ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుకోనున్న యాత్ర

కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన యాత్ర…ఉదయం ఆరాంఘర్ మీదుగా పురాణాపూల్ చేరుకోనుంది. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకోనున్న యాత్ర. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న రాహుల్. పాదయాత్రలో రాహుల్ గాంధి ని కలిసిన రోహిత్ వేముల తల్లి…ఆమె తన పరిస్థితి వివరించగా రాహుల్ సముదాయించారు.

సాయంత్రం రాహుల్ తో పాటు జోడో యాత్రలో పాల్గొననున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాత్రి 7గంటలకు నెక్లెస్ రోడ్ లో జరిగే కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బోయిన్ పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో రాహుల్ గాంధి బస చేయనున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్