Saturday, January 18, 2025
HomeసినిమాSai Pallavi Bollywood Entry: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఫిదా బ్యూటీ..?

Sai Pallavi Bollywood Entry: బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ఫిదా బ్యూటీ..?

ఫిదా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏ కథలో అయినా.. ఆ పాత్రకు తగ్గట్టుగా నటించి మంచి పెర్ ఫార్మర్ అనిపించుకుంటుంది. అలాగే డ్యాన్స్ అయితే.. అదరగొట్టేస్తుంటుంది. అందుకనే ఆమె డ్యాన్స్ కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చూసే జనాలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమెకు ఎంతగానో క్రేజ్ ఉన్నప్పటికీ.. భారీగా ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. కథ.. అందులోని పాత్ర నచ్చితేనే సినిమా చేస్తుంటుంది.

ఇలా మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తున్న ఈ ఫిదా బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. జునైద్ కు జంటగా సాయిపల్లవిని ఎంపిక చేశారట. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఆమె ఏ సినిమాలో అయినా నటించడానికి ఓకే చెప్పిందంటే.. ఆ సినిమాలో మంచి కథ ఉందని అర్థం. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇటీవల సౌత్ హీరోయిన్ నయనతార జవాన్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ సాయిపల్లవి కూడా బాలీవుడ్ లో ప్రవేశించబోతుంది. ఈమె యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కు నార్త్ జనాలు కూడా ఫిదా అవ్వడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్