Wednesday, June 17, 2026
HomeసినిమాShah Rukh Khan: క్రిస్మస్ కి వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన షారుఖ్‌

Shah Rukh Khan: క్రిస్మస్ కి వస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన షారుఖ్‌

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆమధ్య సరైన సినిమాలు చేయకపోవడం వలన వరుసగా ఫ్లాప్స్ చూడాల్సివచ్చింది. ఇక అప్పటి నుంచి కథల పై కసరత్తు చేసిన షారుఖ్.. పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అంతటితో ఆగలేదు.. ఇటీవల జవాన్ అంటూ వచ్చి మరో బ్లాక్ బస్టర్ సాధించాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఇలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించి బాలీవుడ్ కి ఊపిరిపోశాడు బాలీవుడ్ బాద్ షా. దీంతో షారుఖ్ నెక్ట్స్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది.

షారుఖ్ నెక్ట్స్ మూవీ డంకి. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే… ఈ సినిమా వాయిదా పడింది అంటూ ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై షారుఖ్ క్లారిటీ ఇచ్చారు. జవాన్ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా బాలీవుడ్ లో మీడియా మీట్ ఏర్పాటు చేశాడు. అందులో డంకి సినిమాని క్రిస్మస్ కి విడుదల చేయనున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. పక్కా ప్లానింగ్ తో దూసుకెళుతున్నాడు. పఠాన్, జవాన్.. ఈ రెండు సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించడంతో డంకి మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి.. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular