Saturday, January 18, 2025
Homeసినిమావైజాగ్ నేపథ్యంలో సంజయ్ ''గుట్టు చప్పుడు''

వైజాగ్ నేపథ్యంలో సంజయ్ ”గుట్టు చప్పుడు”

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు , ఓ పిట్ట కథ  ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు  సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

అనంతరం చిత్ర హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. ‘గుట్టు చప్పుడు’ సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. ఈ స్క్రిప్ట్ నాకు దర్శకుడు మణీంద్రన్ చెప్పినప్పుడు అయన చెప్పిన కథ కంటే కూడా అయన ఇచ్చిన నేరేషన్ నాకు బాగా నచ్చింది” అన్నారు.

నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ …ముందుగా మా హీరో సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు ..  నేను దర్శకుడు మణి చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్ .. మా కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నప్పుడు చాలా కథలు అనుకున్నాం.. కానీ గుట్టు చప్పుడు కథ నాకు బాగా నచ్చింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు షెడ్యూల్స్ ఉన్నాయి .. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతాం. తప్పకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు.

దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ …  మా హీరో సంజయ్ కి హ్యాపీ బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నాను .. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఇది వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది .. పక్కా మాస్ అండ్ లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ అని చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్