Saturday, July 27, 2024
HomeTrending Newsబెంగాల్ ప్రజలకే అవమానం : శివరాజ్ సింగ్ చౌహాన్

బెంగాల్ ప్రజలకే అవమానం : శివరాజ్ సింగ్ చౌహాన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వ్యవహరించిన తీరును మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా తప్పుబట్టారు. మమత తీరు మొత్తం బెంగాల్ ప్రజలకే అవమానం అని వ్యాఖానించారు.

యాష్ తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోడీ శుక్రవారం పర్యటించారు. బెంగాల్ లో పర్యటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. అదే ప్రదేశంలో ఉన్నప్పటికీ సిఎం మమతా బెనర్జీ సమావేశానికి అరగంట ఆలస్యంగా వచ్చారు. కాసేపు ఆమె రాక కోసం నిరీక్షించిన ప్రధాని… ఆ రాష్ట్ర గవర్నర్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. కాసేపటికి వచ్చిన మమత, ప్రధానికి ఓ వినతి పత్రం ఇచ్చి వెంటనే వెనుదిరిగారు.  మమత తీరును బెంగాల్ గవర్నర్ ధన్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సరైన పధ్ధతి కాదని హితవు పలికారు.

శివరాజ్ ఈ వ్యవయారంపై స్పందిస్తూ ప్రధాని మోడీ బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం. తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆడుకోవడానికి వస్తే మమత ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలకు నైతిక మద్దతు తెలిపేందుకు మోడీ వస్తే మమత ఈ విధంగా ప్రవర్తించడం బాధాకరమని భారత రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మమత తీరు రాజ్యంగ విలువలను మంటగలపడమేనని. సమాఖ్య స్పూర్తికి విఘాతమని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా  వ్యాఖ్యానించారు.

కాగా, తనకు ఇతర సమావేశాలు ఉండడంతో ప్రధానికి వినతిపత్రం సమర్పించి, ఆయనతో చెప్పే బైటకు వచ్చానని మమత వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్