Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ ను  హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా  హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… “గొప్ప సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మించారు.  రామ్ అగ్నివేశ్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. దీన్ని హీరో రామ్ అగ్నివేశ్ ఎన్టీఆర్ గెటప్ వేసుకొని సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా పోస్టర్, డైలాగ్ వెర్షన్ రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది.  కొత్త వాళ్ళు అయినా సినిమా బాగా తీశారు. టీమ్ అందరికి నా బెస్ట్ విషెష్ తెలుపుతున్నాను” అన్నారు.

డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ… మేము అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ ఒప్పు కున్నందుకు నా ధన్యవాదములు, ఆ పోస్టర్ లాంచ్ చేసిన తరువాత, ఆ డైలాగ్ వెర్షన్ చూసిన తరువాత హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా సపోర్ట్ చేశారు, మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసి మంచి ప్రశంసలు ఇచ్చారు.

హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ. . హీరో శ్రీకాంత్ గారు నా సినిమా పోస్టర్ అండ్ డైలాగ్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది, నేను భయపడుతూ వున్నాను ఆయన నన్ను దగ్గరకి తీసుకోని చాలా బాగాచేసావ్ అని మెచ్చు కున్నారు.  ప్రొడ్యూసర్ అశ్విని నాయుడు మాట్లాడుతూ.. శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదములు, మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, సినిమా లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఈడైలాగ్ వెర్షన్ టీజర్ లాంచ్ చేయటం చాలా ఆనందం గా వుంది, ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము

RELATED ARTICLES

Most Popular

న్యూస్