Monday, March 16, 2026
Homeసినిమాభీమ్లా నాయ‌క్ నుంచి మ‌రో పాట విడుద‌ల‌

భీమ్లా నాయ‌క్ నుంచి మ‌రో పాట విడుద‌ల‌

Adavi Thalli Maata:
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రేజీ స్టార్ రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ మూవీకి రీమేక్ గా రూపొందుతోంది. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అయితే..  ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పాటలు రిలీజ్ చేశారు. ఈ మూడు పాట‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ రోజు ‘అడవి తల్లి మాట…’ పాటని విడుదల చేశారు. ఇక ఈ పాట విష‌యానికి వ‌స్తే.. ‘కిందున్న మడుసులలా.. కోపాలు తెమలవు.. పైనున్న సామేమే కిమ్మని పలకడు..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. అడవి తల్లి మాట పాటకు సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ థమన్ అద్భుతమైన ట్యూన్ సమకూర్చారు. గీత ర‌చ‌యిత‌ రామజోగయ్య శాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. ఈ పాట‌ను జానపద గాయని కుమ్మరి దుర్గవ్వ, సాహితీ చాగంటి కలిసి ఆలపించారు. ఈ భారీ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : భీమ్లా నాయ‌క్ నుంచి స్పెష‌ల్ టీజ‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular