Saturday, March 14, 2026
Homeసినిమాఆదిపురుష్ సంక్రాంతి బరి నుంచి తపుకుందా..?

ఆదిపురుష్ సంక్రాంతి బరి నుంచి తపుకుందా..?

ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే.. కృతిసనన్ సీతగా నటిస్తుంది. హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మిశ్రమ స్పందన రావడం అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆదిపురుష్ మేకర్స్ గ్రాఫిక్స్ మరింత క్వాలిటీగా ఉండేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. ‘ఆదిపురుష్‘ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుంది అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆదిపురుష్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కూడా సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడు ఏమో ఈ సినిమా వాయిదా పడింది అని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్లే, సంక్రాంతి బరిలోకి అఖిల్ మూవీ కూడా వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదల అంటూ ఇప్పటి వరకు పోస్టర్లు విడుదల చేసిన చిత్రాలు ఐదు. అవి ఆదిపురుష్, ‘వాల్తేరు వీరయ్య’ ,’వీర సింహ రెడ్డి’ , ‘వారసుడు’ ,’ఏజెంట్’. ఇందులో ఆదిపురుష్ తప్పుకుంటుంది అనేది లేటెస్ట్ టాక్.

ఒకవేళ సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంటే కొత్త డేట్ ఎప్పుడంటే… జనవరి 6, లేదా జనవరి 26 ఈ రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ రెండు డేట్స్ లో ఏదో ఒకటి అవుతుందా లేదా త్వరలోనే ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. మరి.. ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read : ఆదిపురుష్ పై మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular