Sunday, June 14, 2026
Homeసినిమా'ఆదిపురుష్' రన్ టైమ్ ప్లస్సా..? మైనస్పా..?

‘ఆదిపురుష్’ రన్ టైమ్ ప్లస్సా..? మైనస్పా..?

ప్రభాస్,ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రాన్ని మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ప్రీ రిలీజ్ తర్వాత అయితే.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు ఆదిపురుష్ రన్ టైమ్ ప్లస్సా..? మైనస్సా..? అనేది ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు అని తెలిసింది. అంటే ఒక్క నిమిషం తక్కువ మూడు గంటల సినిమా. ఈ జనరేషన్ లో మూడు గంటల పాటు సినిమా చూడడం అనేది కాస్త రిస్క్ ఏమో అనే టాక్ వినిపిస్తుంది. అయితే.. నాటి నుంచి నేటి వరకు మూడు గంటల పాటు నిడివి ఉన్న సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో దాన వీర శూర కర్ణ.. ఇప్పట్లో ఆర్ఆర్ఆర్ మూవీ సినిమాల నిడివి మూడు గంటలు అయినప్పటికీ జనాలు చూశారు. అందుచేత కంటెంట్ బాగుంటే మూడు గంటలు రన్ టైమ్ ఉన్నప్పటికీ చూస్తారు. అదేమి పెద్ద సమస్య కాదు అనేది సినీ పండితుల వాదన. మరి.. ఆదిపురుష్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular