Sunday, January 19, 2025
Homeసినిమాఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Teaser coming:  పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్‌. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడుగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ సీత‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావ‌ణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ ఆగ‌ష్టులో సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న‌ వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 12న ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని ఆమ‌ధ్య అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఇదిలా ఉంటే.. ఈ నెల 10న శ్రీరామ‌న‌వ‌మి. ఈ సంద‌ర్భంగా ఆదిపురుష్ నుంచి అప్ డేట్ ఉంటుంద‌ని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అభిమానులు కోరుకుంటున్న‌ట్టుగానే ఆదిపురుష్ నుంచి అప్ డేట్ ఇచ్చేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఆదిపురుష్ నుంచి ప్ర‌భాస్ రాముడు గెట‌ప్ తో ఉన్న స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేయాలి అనుకున్నార‌ట‌. అయితే… ఇప్పుడు ప్లాన్ మారిందని తెలిసింది. స్పెష‌ల్ పోస్ట‌ర్ కాకుండా.. ఆదిపురుష్ నుంచి టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Also Read : మరోసారి స్వీటీతో ప్రభాస్

RELATED ARTICLES

Most Popular

న్యూస్