Tuesday, June 9, 2026
Homeసినిమావకీలు పాత్రలో విశ్వక్ సేన్

వకీలు పాత్రలో విశ్వక్ సేన్

Viswak-Vakeel:  వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా అడుగుపెడుతున్నారు.

డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ముఖచిత్రం సినిమాలో విశ్వక్ ఓ స్పెషల్ రోల్ చేశారు. నేడు విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా వ్యవహరిస్తుంది. 15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు.

విశ్వక్ సేన్ కు ముఖచిత్రం టీమ్ పుట్టినరోజు విశెస్ తెలిపింది. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా..ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్ రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది. ముఖచిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.

Also Read థమన్ చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ లిరికల్ సాంగ్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular