Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్, హై టెక్నికల్ మూవీ ‘ఆది పురుష్’ . ఈ భారీ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2023న విడుదల చేయబోతున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. సైఫ్ అలీఖాన్ లంకేశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా ఈ సంవత్సరంలో ఆగస్ట్ 11న విడుదల చేయాలని అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే.. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఆదిపురుష్ మూవీని వాయిదా వేశారు. మరి ఆదిపురుష్‌ను ఎప్పుడు విడుదల చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా… మహా శివరాత్రి రోజు ఆది పురుష విడుదల తేదీ జనవరి 12, 2023 అని ప్రకటించారు.
Must Read : రేపటి నుంచి దేశవ్యాప్తంగా ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్