Monday, June 8, 2026
Homeసినిమారేపటి నుంచి దేశవ్యాప్తంగా 'రాధే శ్యామ్' ప్రమోషన్స్

రేపటి నుంచి దేశవ్యాప్తంగా ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్

Promotions Start: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన‌ బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌ కు తోడు కోట్లాది రూపాయల అత్యద్భుతమైన సెట్స్‌ తో పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే మార్చి 2 నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన చిత్ర యూనిట్ తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular