Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

White Paper: 10 hours
‘వైట్ పేపర్’ చిత్రం కేవలం 10 గంటల వ్యవధిలో  చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ రికార్డును గుర్తించి సత్కరించారు. త్వరలో గిన్నిస్ బుక్ రికార్డ్స్ లలో కూడా ఎక్కబోతుంది ఈ చిత్రం. జి ఎస్ కె ప్రొడక్షన్స్ పతాకం పై అదిరే అభి (అభినయ కృష్ణ) వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నందకిషోర్ నటీనటులుగా శివ దర్శకత్వంలో గ్రంధి శివప్రసాద్ నిర్మించిన చిత్రం వైట్ పేపర్ టీజర్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ అతిరధుల‌ సమక్షంలో విడుదల చేశారు. ముఖ్య అతిధిగా వచ్చిన ఎమ్మెల్యే రోజా టీజర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత సాయి రాజేష్, నిర్మాత శ్రీనివాస్, నిర్మాత శ్రీకర్, జర్నలిస్ట్ ప్రభు, జబర్దస్త్ టీం మెంబెర్స్ హైపర్ అది, అదిరే అభి, పంచ్ ప్రసాద్, ,రాఘవ, గెటప్ శ్రీను, గడ్డం నవీన్, సనత్ నగర్ సత్తి సుధాకర్, తాగుబోతు రమేష్ , ముక్కు అవినాష్ , శివారెడ్డి బ్రదర్ సంపత్ , సత్తి పండు, నంద కిషోర్, విజయ్ బాస్కర్,  తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్ కు బ్లెస్సింగ్ అంద‌జేశారు.

ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ  “అభి గారి కోసం చాలా సంవత్సరాల తర్వాత  ప్రసాద్ ల్యాబ్ కు రావడం జరిగింది. అభి చాలా డిసిప్లేన్ మల్టీ టాలెంటెడ్. తను ఎప్పుడూ ఏదో చేయాలనే తపన పడుతుంటాడు. అందుకే తను పడే తపన నాకు చాలా నచ్చింది. “పాయింట్ బ్లాంక్” మూవీతో వచ్చి ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్లీ ఈరోజు పది గంటల్లో మూవీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే… మేము తమిళ్ లో ‘స్వయంవరం’ మూవీ ని 24 గంటల్లో పూర్తి చేశాం. ఒక సాంగ్ చేయడానికే 3 నుండి 5 రోజులు పట్టే పాటను ప్రభుదేవా మాస్టర్ తో మేము మూడు గంటల్లో చేసి సినిమాను 24 గంటల్లో చేయాలని పరుగులు పెట్టి సినిమాను పూర్తి చేశాం.  అలాంటిది ఈ సినిమాను పది గంటల్లో పూర్తి చేయడం అంటే మాటలు కాదు. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ సినిమాకు మీరు పడిన కష్టాన్ని, కృషిని మనమందరం మనస్ఫూర్తిగా అభిని అటు దర్శకుడుని అభినందించాలి. ఇందులో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ లేదు. కథ బాగుండి ఆడియన్స్ ను ఆకట్టుకునే ఏ సినిమా అయినా పెద్ద సినిమానే. చాలా చిన్న సినిమాలు విడుదలై  పెద్ద సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాయి. ఈ వైట్ పేపర్ సినిమా గొప్ప విజయం సాధించి దర్శకనిర్మాతలకు గొప్ప పేరు తీసుకు వచ్చి వీరికి మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను” అన్నారు.

“ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి.10 గంటల్లో సినిమా చెయ్యాలి అంటే కొంతమంది మంది నటీనటులు టెక్నీషియన్ల  భయపడి వెనక్కి వెళ్లిపోయినా కూడా కొంత మంది  వీళ్ళు ధైర్యానికి  మెచ్చుకొని వీరికి సపోర్ట్ గా నిలిచి 10 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు. ఇలాంటి సినిమాలు చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రొటీన్ సినిమాలు చేసే దానికి భిన్నంగా దర్శకుడు శివ ఇలాంటి మంచి కథను ఎన్నుకొని సినిమా చేసినందుకు వీరి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్స్ కి మనము ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్న దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తారు. జబర్దస్త్ కుటుంబ సభ్యుడైన అభిని ఒక యాంకర్ గా చూశాం. దర్శకుడిగా చూశాం. ఇప్పుడు హీరోగా చూస్తున్నాం. ఈ సినిమా తనకి గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com