Monday, January 20, 2025
Homeజాతీయంఅతిధి సింగ్ కు రాయ్ బరేలి టికెట్!

అతిధి సింగ్ కు రాయ్ బరేలి టికెట్!

Aditi Gets: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల రెండో విడత జాబితాను భారతీయ జనతాపార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 85  సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే అతిధి సింగ్ కు రాయ్ బరేలి టికెట్ కేటాయించారు.

107మంది అభ్యర్ధులతో తొలి విడత జాబితాను జనవరి 15న ప్రకటించారు. తాజాగా నేడు ప్రకటించిన 85 తో కలిపి మొత్తం 192 సీట్లకు పేర్లను ఖరారు చేసినట్లయింది. మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ విధాన సభకు ఫెబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : బిజెపిలో చేరిన అపర్ణా యాదవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్