‘ఆదిత్య 999’ ముహుర్తం ఫిక్స్ అయ్యిందా?

నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆదిత్య 369. తెలుగు సినిమాల్లో ఫస్ట్ టైమ్ మిషన్ మూవీగా  ఇది చరిత్ర సృష్టించింది. అయితే.. ఈ  చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తానని బాలకృష్ణ ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. మరో విషయం ఏంటంటే.. ఈ మూవీకి స్టోరీ అంతా రెడీ అయ్యిందన, తనే దర్శకత్వం వహిస్తానని కూడా బాలయ్య ఓ సందర్భంలో చెప్పారు. అప్పటి నుంచి ‘ఆదిత్య 999’పై మరింత ఆసక్తి ఏర్పడింది. 2023లో ఆదిత్య 999 ఉంటుందని, తన కుమారుడు మోక్షజ్ఞ కీలక పాత్ర పోషించనున్నాడని కూడా బాలయ్య తెలియచేశారు.

ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అనిల్ రావిపూడితో బాలయ్య తర్వాతి సినిమాను ఇటీవలే ప్రారంభించారు. అయితే.. ఆదిత్య 999 సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ లో చేస్తారు, నిజంగా ఫిబ్రవరిలో మొదలవుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *