Saturday, June 13, 2026
Homeసినిమాఅడివి శేష్ పాన్ ఇండియా మూవీ 'G2'

అడివి శేష్ పాన్ ఇండియా మూవీ ‘G2’

వైవిధ్యమైన, విలక్షణమైన, ఒకదానికొకటి ప్రత్యేకమైన తన చిత్రాల తో భారీ ఫాలోయింగ్ క్రియేట్ చేశారు అడివి శేష్. కథల ఎంపికతో ప్రేక్షకుల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. అడివి శేష్ ‘గూఢచారి’ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. వీరి రెండో కలయికలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ గా వచ్చిన  ‘మేజర్‌’  పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

తాజా సినిమా ‘HIT2 ‘తో మరో హిట్ అందుకున్నారు శేష్ తన ‘గూఢాచారి’ సీక్వెల్‌ ని ‘G2’ పేరుతో తదుపరి ప్రాజెక్ట్‌ గా ప్రకటించారు.  ఈ సినిమా ప్రీ విజన్ వీడియోను జనవరి 9వ తేదీన ఢిల్లీ, ముంబై రెండింటిలో ఒకే రోజున విడుదల చేయనున్నారు.

“మేజర్” చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శేష్ స్వయంగా కథ రాశారు. ఈ భారీ-బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మూడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌ లు కలసి నిర్మిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వీరి ఆధ్వర్యంలో వచ్చిన  ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ చిత్రాలు ఆల్ ఇండియన్ హిట్స్ గా నిలవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular