తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను గమనించానని టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు. తాజా వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యతపై కంట్రోల్ ఉండదు. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు” అంటూ వివరణ ఇచ్చారు. రూ.75 లక్షలతో నెయ్యి నాణ్యత కొలిచే ల్యాబ్ తయారయ్యేదని, కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.
“తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. లడ్డూ క్వాలిటీ బాగుండాలంటే నెయ్యి నాణ్యత బాగుండాలి. లడ్డూ తయారీకి నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలి. నెయ్యి నూనెలా ఉంది. నెయ్యి నాసిరకంగా ఉందని కాంట్రాక్టర్లకు చెప్పాం. టీటీడీకి సొంత టెస్టింగ్ ల్యాబ్ లేదు. రూ.75 లక్షల ఖర్చయ్యే ల్యాబ్‌ను ఎందుకు పెట్టలేదో తెలియదు. అదే సరఫరాదారులకు అవకాశంగా మారింది. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. నెయ్యి నాణ్యత బాగా లేదు అని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారు” అని పేర్కొన్నారు.
టిటిడి ఈవో మాట్లాడిన ముఖ్యాంశాలు:
- తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది.
- 2౦.32 శాతం కల్తీ జరిగినట్లు తేలింది.
- ఏఆర్ కంపెనీ పంపిన నాలుగు త్యంకర్లలోని నెయ్యిని 10 ల్యాబ్స్ కు పంపాము
- నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్డిడి బి ల్యాబ్ కు పంపాం
- ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలింది
- వెజిటబుల్ ఫ్యాట్, పండి కొవ్వు కలిసినట్లు తేలింది
- జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్లు ఎన్డిడిబి తేల్చిందినెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు తీసుకున్నాం
- నెయ్యి పంపిణీ కోసం కొత్త టెండర్లు పిలిచాం, ఇప్పుడు తీసుకుంటున్న నెయ్యి నాణ్యత బాగుంది.