Wednesday, June 17, 2026
HomeTrending NewsYSRCP: టిడిపి ఇక కనిపించదు: విజయసాయి

YSRCP: టిడిపి ఇక కనిపించదు: విజయసాయి

రాబోయే ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని,  స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు పదేళ్ళ వరకూ జైలు శిక్ష పడుతుందని అన్నారు.  చంద్రబాబుతో పాటు ఈనాడు అధినేత రామోజీరావుకు కూడా మార్గదర్శి కేసులో శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

“చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691. 7+6+9+1 = 23. చంద్రబాబు గారూ…మీకు 2023 చివరి సంవత్సరం. 24 నుంచి రాజకీయ యవనికపై ఇక కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు” అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular