Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య‌, కొర‌టాల కాంబో మూవీ ఫిక్స్?

బాల‌య్య‌, కొర‌టాల కాంబో మూవీ ఫిక్స్?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం 107వ మూవీ చేస్తున్నారు. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌య్య అందాల తార శృతి హాస‌న్ న‌టిస్తుంది. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ఈ భారీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో 108వ సినిమా చేయనున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రాకి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక బాల‌య్య 109వ చిత్రాన్ని ఎవ‌రితో అంటే… డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పేరు వినిపించింది కానీ.. ఇప్పుడు కొర‌టాల శివ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికి సెట్ అయ్యింద‌ని టాక్ బలంగా వినిపిస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే… ఈ క్రేజీ కాంబో మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించ‌నున్నార‌ని స‌మాచారం.

కొర‌టాల శివ‌.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా న‌వంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా పూర్త‌య్యేలోపు బాల‌య్య అనిల్ రావిపూడితో సినిమా కంప్లీట్ చేస్తాడు. ఆ త‌ర్వాత ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వ‌స్తుంద‌ని తెలిసింది. బాల‌య్య కోసం ప‌వ‌ర్ స్టోరీ రెడీ చేశాడ‌ట‌. దీంతో కొర‌టాల బాల‌య్య‌ను ఎలా చూపించ‌నున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read: బాల‌య్య అన్ స్టాప‌బుల్ క్రేజీ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్