Friday, April 19, 2024
Homeసినిమాఅంటే ..  నజ్రియాను అంతా మరిచిపోయినట్టేనా?

అంటే ..  నజ్రియాను అంతా మరిచిపోయినట్టేనా?

Nazriya: నజ్రియా నజీమ్ .. మలయాళంలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలనటిగా మలయాళ సినిమాలకి  పరిచయమైన నజ్రియా, మన మీనా మాదిరిగానే అక్కడ హీరోయిన్ అయింది. టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నజ్రియా, విశాలమైన కళ్లతో చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆమె కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఆదిలోనే పలకరించిన హిట్లు అమాంతంగా క్రేజ్ ను పెంచేశాయి. మలయాళంలో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపించేది .. ఆమె ఫొటోలే కనిపించేవి. కుర్రాళ్ల చర్చల్లో నజ్రియా పేరు పిప్పరమెంటులా నానుతూ ఉండేది.

నజ్రియా గ్లామర్ .. ఆమె హావభావ విన్యాసం చూసిన వాళ్లంతా ఆమె ఆరాధకులు జాబితాలో చేరిపోవడం మొదలుపెట్టారు. ఆమెకి పెరుగుతున్న క్రేజ్ కారణంగా ఇతర భాషల నుంచి కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె మలయాళ సినిమాలు తగ్గిస్తూ వచ్చింది .. అడపా దడపా తమిళ సినిమాలు చేసింది. పెళ్లి తరువాత సినిమాల సంఖ్యను మరింతగా తగ్గించి వేసింది. తెలుగు తెరకి పరిచయం చేయాలని చాలామంది మేకర్స్ ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. దాంతో ఇక్కడి అభిమానులు చాలామంది .. చాలా రోజుల పాటే డీలాపడ్డారు.

అంటే .. సుందరానికీ’ సినిమా కోసం నాని రంగంలోకి దిగి ఆమెను టాలీవుడ్ కి తీసుకుని వచ్చాడు. నజ్రియా ఈ సినిమాకి ఓకే చెప్పిందంటే, ఆమె పాత్రకి ఏదో ప్రత్యేకత ఉండొచ్చని అనుకున్నారు. అయితే నజ్రియాలో మునుపటి గ్లామర్ లేకపోవడం .. ఆమె పాత్ర కూడా ఆశించిన స్థాయిలో లేకపోడంతో ఆడియన్స్ పట్టించుకోలేదు. నజ్రియా మాత్రం తనకి టాలీవుడ్  చాలా బాగా నచ్చేసిందంటూ, ఇకపై ఇక్కడి సినిమాలు చేయడానికి తాను రెడీ అనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఆ తరువాత ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు .. కనిపించడం లేదు. ‘అంటే .. సుందరానికీ’ రిజల్ట్ చూసిన తరువాత నజ్రియాను అంతా మరిచిపోయినట్టే కనిపిస్తోంది మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్