Saturday, June 13, 2026
Homeసినిమా'పుష్ప 2' తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే

‘పుష్ప 2’ తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే

పాన్ ఇండియా స్టార్ బన్నీ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పుష్ప ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. అనే డైలాగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో  ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులే కాకుండా.. కామన్ ఆడియన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం వైజాగ్ లో పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ రష్మిక ఫిబ్రవరి నుంచి షూట్ లో జాయిన్ కానుంది. వైజాగ్ లో పది రోజులు షూటింగ్ చేయనున్నారు. ఆతర్వాత బ్యాంకాక్ లో జరిగే భారీ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా ఈ మూవీ ఉంటుందట. ఇక పుష్ప 2 తర్వాత బన్నీ చేసే సినిమా ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

కారణం ఏంటంటే.. బన్నీతో సినిమా చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే.. బన్నీ మాత్రం పుష్ప 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశారు. ఈ మూడు సినిమాలు సక్సెస్ అయ్యాయి. దీంతో మరో సినిమా చేయాలి అనుకున్నారు. 2024 జనవరి ఎండింగ్ లో ఈ సినిమా స్టార్ట్ కానుందని తెలిసింది. 2024 దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 తర్వాత బన్నీ మూవీ అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. మరి.. త్రివిక్రమ్, బన్నీ కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. 

Also Read : పుష్ప 2 బడ్జెట్ ఎంతో తెలుసా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular