Wednesday, June 17, 2026
HomeసినిమాAgent: 'ఏజెంట్' వెనక అసలు ఏమైంది..?

Agent: ‘ఏజెంట్’ వెనక అసలు ఏమైంది..?

అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. చాలా సార్లు వాయిదా పడడంతో ఈ సినిమా విషయంలో ఏదో జరుగుతుంది అనే టాక్ బయటకు వచ్చింది. అన్ని అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ.. అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.

అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే… కథను నమ్మకుండా.. కాంబినేషన్ నమ్మారు. అక్కడే పెద్ద తప్పు జరిగింది. సురేందర్ రెడ్డి బాగా స్టైలీష్ గా చూపిస్తాడు. స్టార్ ఇమేజ్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో ముందుగా కథ లేకుండా సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆతర్వాత కథను వండడం స్టార్ట్ చేశారు. ఓ కథ అనుకున్న తర్వాత ఈ మూవీ టీమ్ లో కొంత మందికి నచ్చకపోవడంతో మళ్లీ మార్పులు చేర్పులు చేశారు. షూటింగ్ సగం అయిన తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు చేశారు. ఇలా.. మార్పులు చేస్తూనే ఉన్నారు. కథను మారుస్తూ వెళ్లడం వలన ఆఖరికి కథ గందరగోళంగా తయారయ్యింది.

ఒక పాయింట్ తీసుకుని సిన్సియర్ గా వర్క్ చేసి కథ అంతా సెట్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళితే ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఇలా ముందుగా కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే.. ఇలాగే ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ తన సత్తా ఏంటో.. తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇంకా చెప్పాలంటే.. తను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలనని ప్రపంచానికి తెలియచేశాడు. అఖిల్ కి స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. మరి.. నెక్ట్స్ మూవీతో అయినా బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటాడని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular