Tuesday, April 16, 2024
Homeసినిమా'ఏజెంట్'పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్

‘ఏజెంట్’పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్

Agent: అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంక‌ర‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల వైజాగ్ లో ఏజెంట్ మూవీకి సంబంధించిన ఇంట‌ర్వెల్ ఎపిసోడ్ చిత్రీక‌రించారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి వీడియో లీక‌వ్వ‌డం.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం తెలిసిందే.

అయితే.. ఈ సినిమా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ని.. అందుచేత సినిమా ఆగిపోయింద‌ని.. వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఏజెంట్ మూవీకి ఏమైంది.? అస‌లు ఎప్పుడు సినిమా విడుద‌ల కానుంది..? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై నిర్మాత అనిల్ సుంక‌ర ఈ రోజు ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఏజెంట్ తాజా షెడ్యూల్ మ‌నాలిలో స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా టీజ‌ర్ కు సంబంధించి అప్ డేట్ త్వ‌ర‌లో రాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించి ప్ర‌చారంలో ఉన్న రూమ‌ర్స్ ను న‌మ్మ‌ద్దు. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసిన‌వాటిని మాత్ర‌మే న‌మ్మండి అని చిత్ర నిర్మాత అనిల్ సుంక‌ర ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్